ఇండియాలో నోకియాకు చెందిన పలు మోడల్స్ లో ధరలను తగ్గించినట్లు తెలిపింది సంస్థ. నోకియా 7.1 ఫోన్ భారత్‌లో రూ.19,999 ధరకు విడుదల కాగా, ఏప్రిల్ లో ఈ ఫోన్ ధర తగ్గి రూ.17,999 అయింది. అయితే ఇప్పుడు మళ్లీ ధరను తగ్గించడంతో.. ప్రస్తుతం ఈ ఫోన్‌ను వినియోగదారులు రూ.12,999 ధరకే కొనుగోలు చేయవచ్చని తెలిపింది నోకియా.
నోకియా 6.1 ప్లస్ కు చెందిన 4GB ర్యామ్ వేరియెంట్ ధర రూ.15,999 ఉండగా ..అది రూ.4వేలు తగ్గి రూ.11,999గా ఉంది. ఈ ఫోన్ కు చెందిన 6GB ర్యామ్ వేరియెంట్ ధరను రూ.18,499 నుంచి రూ.14,999 ధరకు తగ్గించారు. ప్రస్తుతం తగ్గిన ధరలకే ఈ రెండు ఫోన్లను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చని చెప్పింది.
నోకియా 7.1 ఫోన్ ఫీచర్స్..
5.84 ఇంచ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4GB ర్యామ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 64GB స్టోరేజ్, 3060MAH బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తుంది.
నోకియా 6.1 ప్లస్ ఫోన్ లో
5.8 ఇంచ్ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 GB ర్యామ్, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 64GB స్టోరేజ్, 3060 MAH బ్యాటరీ తదితర ఫీచర్లను ఉన్నాయి.
