ప్రముఖ ఫోన్ మేకర్ నోకియా ఇండియా మార్కెట్లోకి ‘2.3’ మోడల్ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చింది. అద్భుతమైన ఫొటోలు తీయడానికి ఇందులో ‘రికమెండ్ షాట్ ’, ‘బొకే మోడ్ ’ వంటి ఫీచర్లు ఉన్నాయి. ధర రూ.8,199లని కంపెనీ తెలిపింది. ఇందులో 6.2 ఇంచుల డిస్ ప్లే, మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్ , 2జీబీ ర్యామ్ , 32 జీబీ మె మొరీ, డ్యూయల్ కెమెరా లు, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ సిమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ మోడల్ కొంటే రూ.3 వేల విలువైన క్లియర్ ట్రిప్ వోచర్లు, కార్ రెంటల్ కంపెనీ జూమ్ కార్ సేవలపై రూ.రెండు వేల డిస్కౌంట్, జియో నుంచి రూ.2,200 విలువైన క్యాష్ బ్యాక్ లభిస్తాయి.
