Noise Color Fit Pro 4: బ్లూ టూత్‌ కాలింగ్, జీపీఎస్ ట్రాకింగ్

 Noise Color Fit Pro 4: బ్లూ టూత్‌ కాలింగ్,  జీపీఎస్ ట్రాకింగ్

నాయిస్ కొత్త స్మార్ట్ వాచ్‌ లాంఛ్ చేసింది. కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా కలర్ ఫిట్ ప్రో 4 వాచ్ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో జీపీఎస్ ట్రాకింగ్, బ్లూ టూత్‌ కాలింగ్‌ ఫీచర్లు ఉన్నాయి. కాపర్ బ్రౌన్‌, జెట్‌ బ్లాక్‌, గోల్డ్‌ వైన్‌, యాక్టివ్ బ్లూ, షాడో బ్లాక్ కలర్ వేరియంట్లలో వాచ్‌ని తీసుకురానున్నారు. 1.85 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇందులోని 250 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేస్తే 7 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ ఇస్తుంది. IP68 డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్‌తో వస్తుంది.

నాయిస్ కలర్ ఫిట్ ప్రో 4 వాచ్ లో వాకింగ్, రన్నింగ్, యోగా ట్రాకర్ ఉంది. హెల్త్ టెస్ట్, హార్ట్ రేట్ మానిటర్, ఎస్‌పీఓ 2 ట్రాకింగ్, స్లీప్‌తో పాటు విమెన్ హెల్త్‌ ట్రాకింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. 100కన్నా ఎక్కువ స్పోర్ట్స్ మోడ్ ఫీచర్స్‌ కలిగిన ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.2,999గా నిర్ణయించారు.