- సిరీస్ ఈ రౌండ్ ద్వారా 210 డాలర్ల ఫండింగ్
హైదరాబాద్, వెలుగు: రియల్ ఎస్టేట్, రెంటల్, ఫైనాన్షియల్ సేవలు అందించే నోబ్రోకర్ డాట్‌కామ్ యూనికార్న్ స్టార్టప్ హోదా దక్కించుకుంది. బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ వాల్యుయేషన్ ఉన్న స్టార్టప్‌లను యూనికార్న్‌గా పిలుస్తారు. అంతేగాక ఈ సంస్థ తాజా రౌండ్‌లో 210 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1,564 కోట్లు) ఫండింగ్ పొందింది. దీంతో నోబ్రోకర్ భారతదేశంలోనే మొట్టమొదటి ప్రాప్ టెక్ యునికార్న్‌గా మారింది. ఇప్పటి వరకు ఇది 361 మిలియన్ డాలర్లను సేకరించింది.
తాజా రౌండ్‌లో జనరల్ అట్లాంటిక్, టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్, మూర్ స్ట్రాటజిక్ వెంచర్స్ ఇన్వెస్ట్ చేశాయి. తాము అందిస్తున్న సేవలకు బ్రోకరేజీ వసూలు చేయడం లేదని ఈ యూనికార్న్ ప్రకటించింది. ప్రస్తుతం బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, పూణేలలో సేవలు అందిస్తున్నామని ప్రకటించింది. జనరల్ అట్లాంటిక్ మేనేజింగ్ డైరెక్టర్ శంతను రస్తోగి మాట్లాడుతూ ‘‘మా ప్లాట్‌ఫామ్ ద్వారా ఇంటి, ఆఫీసు అద్దెలు కట్టవచ్చు. ఇండ్లను అమ్మొచ్చు. కొనొచ్చు ఇప్పటికే 75 లక్షలకు పైగా ఆస్తుల అమ్మకం/కొనుగోలు కోసం క్లాసిఫైడ్ యాడ్స్ వచ్చాయి. దాదాపు1.6 కోట్ల మందికి పైగా వినియోగదారులు నోబ్రోకర్ సేవలను ఉపయోగించుకున్నారు”అని ఆయన వివరించారు.
