జీఎంఆర్‌ పన్ను కట్టక్కర్లేదు

జీఎంఆర్‌ పన్ను కట్టక్కర్లేదు
  • మాల్దీవుల ప్రభుత్వ ప్రకటన
  • హర్షం వ్యక్తం చేసిన జీఎంఆర్

జీఎంఆర్‌‌‌‌ గ్రూప్‌ కు సంతోషకరమైన నిర్ణయాన్ని మాల్దీవుల ప్రభుత్వం ప్రకటించింది. ఆ దేశంలోఎయిర్‌‌‌‌పోర్టు ప్రాజెక్టును పోగొట్టుకుని, కాం పెన్సేషన్‌ గా జీఎంఆర్‌‌‌‌ పొందుతున్న మొత్తం మీద పన్నులు, ఫైన్లను విధించబోమని స్పష్టం చేసింది. ఆదాయపుపన్ను, ఫైన్లు కలిపి 20 మిలియన్‌ డాలర్ల దాకా ఉంటాయి.

2017లో రూ. 137 కోట్లు (20.5మిలియన్‌ డాలర్లు) ఆదాయపు పన్ను చెల్లించాలంటూ మాల్దీవుల ప్రభుత్వం జీఎంఆర్‌‌‌‌ మాలె ఇంటర్నేషనల్‌ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌ లిమిటెడ్‌ (జీఎంఆర్‌‌‌‌ గ్రూప్‌ కంపెనీ)కి నోటీసు జారీ చేసింది. మాలె ఎయిర్‌‌‌‌పోర్టు ఆధునీకరణ ప్రాజెక్టును అంతకు ముం దు జీఎంఆర్‌‌‌‌ చే జిక్కించుకున్నప్పటికీ, ఆ తర్వాత ప్రాజెక్టును గడువుకు ముందే రద్దు చేశారు. దీంతో జీఎంఆర్‌‌‌‌ అంతర్జాతీయ మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించి, 270 మిలియన్‌ డాలర్ల కాంపెన్సేషన్‌ కు అనుమతి తెచ్చుకుంది. ఐతే,ఈ కాం పెన్సేషన్‌ పైనా పన్ను, ఫైన్‌ విధించాలని అప్పట్లో మాల్దీవుల ప్రభుత్వం భావించింది. కానీ, ఇటీవలఆదాయపు పన్ను, ఫైన్లు విధించడం లేదని మాల్దీవుల ప్రభుత్వం తమకు తెలియచేసినట్లు జీఎంఆర్‌‌‌‌ గ్రూప్ తెలిపింది.

జూన్‌ 28, 2010 న మాల్దీవుల ప్రభుత్వంతో ఇబ్రహీం నసీర్‌‌‌‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌‌‌‌పోర్టు కోసం 25 ఏళ్ల ఎగ్రిమెంట్‌ ను జీఎంఐఏఎల్‌ కుదుర్చుకుంది. దీనిని అక్కడి ప్రతిపక్షం వ్యతిరేకించింది. 2012లో వచ్చి న కొత్త ప్రభుత్వం పాత ఒప్పందాన్ని రద్దు చేసింది. ఫలితంగా జీఎంఆర్‌‌‌‌ గ్రూప్‌ కాం పెన్సేషన్‌ కోసం  సింగపూర్‌‌‌‌లోని ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ ను ఆశ్రయించింది. ఒప్పందాన్ని రద్దు చేసినందుకుగాను జీఎంఆర్‌‌‌‌కు 270 మిలియన్ డాలర్లు చె ల్లించాలని ఆదేశించింది. దాంతో 2017–18 సంవత్సరానికి గాను14.4 మిలియన్‌ డాలర్లు పన్ను, మరో 2.8 మిలియన్‌ డాలర్లు అదనపు పన్ను, ఇంకో 3.3 మిలియన్‌ డాలర్లు ఫైన్‌ ను చె ల్లించాలంటూ జీఎంఆర్‌‌‌‌కు మాల్దీవుల ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను జీఎంఆర్‌‌‌‌ గ్రూప్ పట్టించుకోలేదు. మాల్దీవులలోని ప్రధాన ఎయిర్‌‌‌‌పోర్టు ఆధునీకరణ, మెయింట్‌ నెన్స్‌‌‌‌ల కోసం 500మిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్టును జీఎంఆర్‌‌‌‌ చేజిక్కించుకుంది.