ఓయో సంచలన నిర్ణయం.. ఇకనుంచి పెళ్లి కాని జంటలకు రూమ్ ఇవ్వరంట..


ట్రావెల్ బుకింగ్ సంస్థ ఓయో కస్టమర్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పింది. కొత్త చెక్ - ఇన్ పాలసీలో భాగంగా ఇక నుంచి పెళ్లికాని జంటలకు రూమ్స్ బుకింగ్ ఉండదని ప్రకటించింది. కొత్త సంవత్సరం చెక్-ఇన్ పాలసీలో భాగంగా ఈ నిర్నయం తీసుకున్నట్లు తెలిపింది.

రూమ్స్ కావాలంటే ఈ ప్రూఫ్స్ తప్పనిసరి

పెళ్లి కాని జంటలకు రూమ్ ఇవ్వమని చెప్పిన ఓయో.. రూమ్స్ కావాలంటే కచ్చితంగా కొన్ని డాక్యుమెంట్లు కావాలని తెలిపింది. పెళ్లి అయినట్లుగా కచ్చితమైన ప్రూఫ్స్ ఉంటేనే అనుమతి ఉంటుందని ప్రకటించింది. 

మొదటగా ఆ నగరం నుంచే:

ఓయో తమ పార్ట్నర్ హోటల్స్ కు ఇచ్చిన కొత్త చెక్ - ఇన్ పాలసీలో పెళ్లి కాని జంటలకు రూమ్స్ ఇవ్వకూడదని తెలిపింది. అయితే అది మొదటగా మీరట్ నగరం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపింది. సమాజం నుంచి చాలా ఎక్కువ మొత్తంలో అభ్యర్థనలు వచ్చినందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఓయో ఒక ప్రకటనలో తెలిపింది. కస్టమర్స్ విశ్వాసాన్ని నిర్మించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఓయో తెలిపింది. 

ALSO READ : గ్రేట్ : నాలుకతో స్పీడుగా తిరిగే ఫ్యాన్ బ్లేడ్ లను ఆపాడు.. గిన్నిస్ రికార్డ్ సాధించాడు..

ఇప్పటి వరకు కపుల్స్ కే ఇవ్వాలన్న నిబంధనలు లేకపోవడంతో ఓయో కు భారీ ఎత్తున రెవెన్యూ వచ్చేది. అయితే ఆదాయాన్ని వదులుకొని ఈ నిబంధనలను ఓయో అమలు చేస్తుందా అని కొందరు సందేహిస్తున్నారు.