మెడిసిన్ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ 2021 పరీక్షను రద్దు చేసే అవకాశం లేదని చెప్పారు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్. గురువారం విద్యాశాఖ మంత్రి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2021లో జరిగే CBS, JEE మెయిన్ నీట్ పరీక్షలపై నెలకొన్న అనుమానాలపై సమాధానాలిచ్చారు. JEE మెయిన్స్ ఏడాదికి మూడు, నాలుగు సార్లు నిర్వహించే అంశంపై కూడా నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి కేసులు తగ్గుతుండటంతో స్కూళ్లు తిరిగి ప్రారంభిస్తామని.. ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించాయన్నారు. ఈ ఏడాది నీట్ ఎగ్జామ్ సెంటర్లను మరిన్ని పెంచుతామని, విద్యార్థులు పరీక్ష రాసేందుకు అనువైన పరిస్థితులు కల్పిస్తామని అన్నారు. ఇప్పటికే నీట్‌ను మూడుసార్లు వాయిదా వేశామని.. ప్రస్తుత పరిస్థితుల్లోనూ రద్దు చేయవచ్చన్నారు. అలా చేస్తే విద్యార్థులకు భారీ నష్ట కలుగుతుందన్నారు. ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లోనే నీట్ పరీక్ష జరుగుతోందని, విద్యార్థులు ఆన్లైన్లో జరగాలని కోరుకుంటే ఆ అంశాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపారు. త్వరలోనే పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటిస్తామన్నారు మంత్రి రమేష్ పోఖ్రియాల్.
