పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇస్తలే..: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌

  • వీసీల నియామకాల్లోనూ చోటు లేకుండా పోయింది
  • జనాభా దామాషా ప్రకారం పదవులు ఇవ్వాలి, లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తాం
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌

హనుమకొండ, వెలుగు: పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం దక్కడం లేదని, కనీసం యూనివర్సిటీ వీసీల నియామకంలో కూడా చోటు లేకుండా పోయిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌ అన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు పదవులు దక్కేలా కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకపోతే అసెంబ్లీ ముట్టడికైనా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. హనుమకొండలోని కేయూ గెస్ట్‌‌‌‌హౌజ్‌‌‌‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. వీసీల నియామకాల్లో ముగ్గురికే అవకాశం ఇచ్చి అన్యాయం చేశారన్నారు.

కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం కూడా బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మాదిరిగానే వ్యవహరిస్తోందన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌‌‌‌గా బాలకృష్ణారెడ్డి, వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌గా పురుషోత్తంను నియమించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కానీ ఆ పదవులకు బీసీలు అర్హులు కాదా ? , ఓట్ల కోసం వినియోగించుకుంటున్న బీసీలను అధికారంలో భాగం చేయలేరా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరి మారకపోతే 10 వేల మందితో ఉన్నత విద్యామండలి ఆఫీస్‌‌‌‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యార్థుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రభుత్వాలు యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నాయన్నారు.

వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 70 శాతం ప్రొఫెసర్ల పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదని, మెస్​ ఛార్జీలను ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. యూనివర్సిటీ స్టూడెంట్ల మెస్‌‌‌‌ బిల్లులను 100 శాతం ప్రభుత్వమే భరించాలని, వర్సిటీల్లో టీచింగ్, నాన్‌‌‌‌ టీచింగ్‌‌‌‌ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు. ఓయూ, కేయూ భూములు ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని, వాటిని కాపాడే వరకు పోరాటం చేస్తామన్నారు.

బీసీ విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల కోసం త్వరలోనే ఓయూలో అఖిలపక్ష విద్యార్థి కమిటీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి కార్యాచరణను రూపొందిస్తామన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ గౌడ్, వర్కింగ్‌‌‌‌  ప్రెసిడెంస్‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆరెగంటి నాగరాజు, నాయకులు దాడి మల్లయ్య యాదవ్, అశోక్‌‌‌‌గౌడ్‌‌‌‌, బోనగాని యాదగిరిగౌడ్‌‌‌‌, ప్రదీప్‌ ‌‌‌గౌడ్‌‌‌‌ పాల్గొన్నారు.