కప్పా వేరియంట్ పై ఆందోళన అవసరం లేదు

కప్పా వేరియంట్ పై ఆందోళన అవసరం లేదు

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నా.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువగా కేసులు వస్తున్నాయని చెప్పారు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్. 90 జిల్లాల్లో 80 శాతం పాజిటివ్ కేసులు వస్తున్నాయన్నారు. మొత్తం కేసుల్లో 53 శాతం కేరళ, మహారాష్ట్ర నుంచే వస్తున్నాయని చెప్పారు. ప్రజలు చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారని.. ఇది తీవ్ర పరిణామాలకు దారితీసే ప్రమాదముందన్నారు లవ్ అగర్వాల్. ముస్సోరిలోని ఓ వాటర్ ఫాల్ దగ్గర జనం గుమిగూడిన వీడియో చూపించి.. ప్రజలు ఇలాంటి తప్పు చేయొద్దని కోరారు. కప్పా వేరియంట్ పై ఆందోళన అవసరం లేదన్నారు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్. డెల్టాతో పోలిస్తే ఇది అంత ప్రమాదకరం కాదన్నారు. యూరప్ తో పాటు చాలా దేశాల్లో కరోనా తగ్గినట్టే కనిపించినా.. ఇప్పుడు ఆ దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.