ఈ మధ్య కాలంలో ప్రతి దానికి డ్రస్ కోడ్ అమలు చేస్తున్నారు. పెళ్లిళ్లలో బ్యాండ్ మేళం వారు కూడా డ్రస్ కోడ్ పాటిస్తారు. ఇప్పుడు డ్రస్ కోడ్ పెళ్లికూతురు కూడా పాటించాలట. అయితే మహారాష్ట్రలో సిక్కుమతానికి చెందిన వారు వధువుకు డ్రస్ కోడ్ అమలు చేయాలని మతపెద్దలు నిర్ణయం తీసుకున్నారు. వధువులు లెహంగా ధరించవద్దని.. సల్వార్ కమీజ్... చున్నీతో పంజాబీ సంప్రదాయ దుస్తులను నిర్ణయించాలని సూచిస్తున్నారు.
మహారాష్ట్రలోని నాందేడ్సిక్కుమత పెద్దలు వధువులు ఎలాంటి డ్రస్ ధరించాలో ఎందుకు ధరించాలో వివరాలు తెలుపుతూ ఒక జాబితాను విడుదల చేశారు. లెహంగాకు బదులు చున్నీతో పంజాబీ సంప్రదాయ దుస్తులను ధరించాలని సూచిస్తున్నారు. పెళ్లి అనేది ఒక పవిత్రమైన వేడకంటూ ... ఫ్యాన్సీ వివాహాల వేడుకలకు ఖర్చులు తగ్గించుకోమని సలహా ఇస్తున్నారు. పెళ్లిలో వధువు కొన్ని ఆచారాలను నిర్వహించాల్సి ఉంటుంది.
భారీ లెహంగా ధరించడం వలన అలాంటి ఆచారాలను నిర్వహించడం కష్టతరంగా ఉంటుందని .... అందువల భారీ లెహంగాను నిషేధించారు. ఇంకా ఫ్యాన్సీ లెహంగాలు ధరించడం వల్ల వధువు పెళ్లి పీటలపై కూర్చోవడం ... పెళ్లిలో వధువు చేయవలసిన పూజలు చేయడం కష్టతరంగా ఉంటుందని సిక్కు మత పెద్దలు చెబుతున్నారు. సల్వార్ కమీజ్ చున్నీ వస్త్రధారణ సిక్కు మతానికి చెందిన సంప్రదాయాలకు ప్రతీక అని చెబుతూ... డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు పవిత్ర పుస్తకాన్ని తీసుకెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. గురు గ్రంథ్ సాహిబ్ పవిత్ర పుస్తకాన్ని రిసార్ట్ లకు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని అకల్-తఖ్త్ సర్ అమృత్‌లోని అత్యున్నత అధికారి ఆదేశాలు జారీచేశారు.
వివాహాల కోసం విపరీతంగా ఖర్చుచేయడంతో ... ప్రధాన విలువలు.. సారాంశాలు మర్చి పోతున్నారని తెలిపారు. కొత్తగా పెళ్లయ్యే దంపతులు దేవుని ఎదుట కొన్ని వాగ్దానాలు చేస్తారని.. గురుద్వారా లోపల పవిత్ర గ్రంథం ముందు వధువు వరుడు ముఖ్యమైన సందర్భాన్ని అలంకరించడం చాలా ముఖ్యమని అకల్ తఖ్త్ చెప్పారు. పవిత్ర గ్రంథాన్ని గురుద్వారా నుండి బయటకు తరలించలేమని, ఏ పెళ్లికైనా ప్రధాన ఆచారాలు గురుద్వారాలోనే జరగాలని పేర్కొంది.
