ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్లు కు కొత్త కరోనా మ్యూటేషన్ ను అంతం చేసే శక్తి ఉన్నట్లు యూకే, సౌతాఫ్రికాలో నిర్వహించిన టెస్ట్ ల్లో తేలిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. యూకే, సౌతాఫ్రికాలో పాత కరోనా వైరస్ కోసం తయారు చేసిన వ్యాక్సిన్ కొత్త కరోనా వైరస్ ను ఎదుర్కొనే శక్తి లేదనే ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ కే. విజయ్ రాఘవన్ తెలిపారు.
ఎక్కువ శాతం కరోనా వైరస్ వ్యాక్సిన్ లో ప్రొటీన్ పై దాడి చేస్తాయని, ఆ సమయంలో వైరస్ జెనిటిక్ కోడ్ ఆధారంగా కొత్తవైరస్ మార్పులు చెందుతున్నారు. కానీ కరోనా వ్యాక్సిన్ ఇమ్యూనిటీ సిస్టమ్ పెరిగేలా యాంటీ బాడీస్ ను ఉత్పత్తి చేస్తుందన్నారు. అంతేకాదు వైరస్ లో మార్పుల కారణంగా ఇప్పటికే తయారు చేసిన వ్యాక్సిన్ పనిచేయదన్నా ఆధారాలు లేవని ప్రొఫెసర్ కే. విజయ్ రాఘవన్ స్పష్టం చేశారు.
కొత్త కరోనా వైరస్.., ఇతర వైరస్ ల కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందన్న ప్రొఫెసర్.., ఇప్పటికే యూకే, సౌతాఫ్రికాలో వ్యాపించిన ఈ కరోనా ఇప్పుడు లండన్, ఇంగ్లాండ్ లో కూడా వ్యాపిస్తుందనే లక్షణాలు వెలుగులోకి వచ్చాయన్నారు.
