సినిమా టికెట్లపై సెస్సు.. రేట్ల పెంపు కూడా లేదు : సీఎం రేవంత్ రెడ్డి

తెలుగు సినిమా ఇండస్ట్రీతో జరిగిన సమావేశంలో.. సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలు వెల్లడించారు. ఇక నుంచి బెనిఫిట్ షోలే కాదు.. ఎంత పెద్ద సినిమా అయినా సినిమా టికెట్ రేట్ల పెంపు కూడా ఉండదని స్పష్టం చేశారాయన. ఎంత పెద్ద సినిమా అయినా.. ఎంత బడ్జెట్ అయినా సరే.. స్పెషల్ గా టికెట్ రేట్ల పెంపు అనేది లేదని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయంలో రాజీ పడేది లేదని చెబుతూనే.. సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారాయన.

సినిమా టికెట్లపై విధించే సెస్సు ద్వారా వచ్చే డబ్బుతో.. తెలంగాణ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేపడతామని తెలియజేశారు సీఎం. 

Also Read :- చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు

ప్రభుత్వం చేపట్టే సామాజిక అంశాలపై సినీ తారలు ప్రచారం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణన సర్వే ప్రచార కార్యక్రమాల్లో సినిమా హీరోలు, హీరోయిన్స్, ఇతర నటీనటుడు పాల్గొనాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీ సహకరించాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మాలన కార్యక్రమాలకు ప్రచారం చేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.