CAAపై వెనక్కి తగ్గేది లేదన్నారు..MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ. కాల్చి చంపినా పూర్వీకుల ఆధారాల గురించి ఎలాంటి కాగితాలు చూపించమన్నారు. బీజీపీ ప్రభుత్వం హిందుత్వ అజెండాతో ముందుకెళ్తోందని ఆరోపించారు. CAAకు వ్యతిరేకంగా కర్నూలు మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన సభకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. NRC, NPR పై ఏపీ ప్రభుత్వం స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సహా అన్ని పార్టీల ముస్లిం నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు సభలో పాల్గొన్నారు.
