IND vs AUS: ఇదీ తెలుగోడి సత్తా.. బాక్సింగ్‌ డే టెస్టులో నితీష్ రెడ్డి సెంచరీ

ఐపీఎల్‌లో రాణిస్తే భారత జట్టులో చోటిస్తారా..? అతనిలో ఏం చూశారని ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేశారు..? గంటకు 110 కిలోమీటర్ల వేగంతో బంతులేసే అతను ఒక ఆల్‌రౌండరేనా..? ఇవీ ఆసీస్ పర్యటనకు ముందు నితీష్ రెడ్డిపై విమర్శకులు ఎక్కుపెట్టిన మాటలు. అటువంటి వారందరికీ తెలుగోడు తన సత్తా ఏంటో చూపెట్టాడు.

ఆసీస్ గడ్డపై, అందునా బాక్సింగ్‌ డే టెస్టులో భారత ఆల్ రౌండర్ నితీశ్‌ రెడ్డి(103*) సెంచరీ సాధించాడు. 171 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో అతను వంద మార్కును చేరుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో అతనికిదే తొలి సెంచరీ. కుమారుడు సెంచరీ చూసి నితీశ్‌ తండ్రి భావోద్వేగానికి లోనయ్యారు. ఆనందంతో కంటతడి పెట్టుకున్నారు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో బాధ్యతగా నితీష్ ఆడిన ఈ ఇన్నింగ్స్ అద్భుతమని చెప్పుకోవాలి. ఈ సిరీస్‌ ద్వారానే అంతర్జాతీయ అరంగ్రేటం చేసినప్పటికీ.. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిగా స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. వాషింగ్టన్ సుందర్ (50)తో కలిసి 127 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి.. జట్టును ఫాలోఆన్ ముప్పు నుంచి గట్టెక్కించాడు.

ALSO READ : IND vs AUS: ఏం పొడుద్దామని ఆ షాట్.. నువ్వు మారవ్..: పంత్‌పై గవాస్కర్ ఆగ్రహం

ప్రస్తుతం టీమిండియా స్కోర్.. 116 ఓవర్లు ముగిసేసరికి 358/9. నితీశ్‌ రెడ్డి(105*), సిరాజ్ (2*) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన ఇంకో 116 పరుగులు వెనకపడి ఉంది.

What a moment for Nitish Kumar Reddy ?

A maiden Test ton when India needed it the most ? #WTC25 | ? #AUSvIND: https://t.co/sW9azPlMfW pic.twitter.com/tUNXG9obfQ

— ICC (@ICC) December 28, 2024

- Sacrificed his job.
- Retired 25 years early.
- Gave his full attention to Nitish Kumar Reddy.
- Took him to training and gave all the facilities he could despite financial conditions.

THIS IS HOW A PROUD FATHER LOOKS LIKE WHEN HIS DREAMS TURNS INTO A REALITY...!!! ?‍♂️?? pic.twitter.com/uc5hnjAtC3

— Mufaddal Vohra (@mufaddal_vohra) December 28, 2024