నాలుగు మంత్రి పదవులు ఇవ్వాల్సిందే..

నాలుగు మంత్రి  పదవులు ఇవ్వాల్సిందే..

కేబినెట్ విస్తరణకు అంతా సిద్ధమైన వేళ నితీష్ కుమార్ పార్టీ పాత డిమాండ్ ను మరోసారి తెరపైకి తెచ్చింది. నాలుగు కంటే తక్కువ కేంద్ర మంత్రి పదవులకు ఒప్పుకునేది లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వంలో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని నిన్న ప్రకటించారు బిహార్ సీఎం నితీష్ కుమార్. ఎన్ని మంత్రి పదవులిచ్చినా తీసుకుంటామన్నారు. ఇప్పటివరకైతే రెండు కేంద్రమంత్రి పదవులు జేడీయూకు దక్కుతాయని తెలుస్తోంది. ప్రస్తుతం లోక్ సభలో తమకు 16 ఎంపీలు ఉన్నారని, కనీసం నాలుగు మంత్రి పదవులు ఇవ్వాలంటున్నారు జేడీయూ నేతలు.