భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభమైంది. పెర్త్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకం. ఈ మ్యాచ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే భారత్ కుర్రాళ్లతో నింపేసింది. అశ్విన్, జడేజా లాంటి సీనియర్లు లేకుండా బరిలోకి దిగింది. మరోవైపు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి తొలి టెస్ట్ ఆడే అవకాశం వచ్చింది. తొలి టెస్ట్ ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేయడం విశేషం.
మ్యాచ్ కు ముందు కోహ్లీ చేతులు మీదుగా నితీష్ రెడ్డి క్యాప్ అందుకున్నాడు. ఐపీఎల్ లో అద్భుతంగా ఆడుతూ టీమిండియా టీ20 జట్టులో స్థానం సంపాదించిన నితీష్.. ఈ క్రమంలో టెస్ట్ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా లాంటి బౌన్సీ పిచ్ లపై నితీష్ రెడ్డి ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా ఎంపికయ్యాడు. నితీష్ జట్టులో ఉంటే బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో సమతుల్యత ఉంటుందని భావించిన భారత యాజమాన్యం అతడికి ప్లేయింగ్ 11 లో చోటు కల్పించింది.
ఇప్పటివరకు భారత్ తరపున నితీష్ 3 టీ20 మ్యాచ్ లాడాడు. 90 పరుగులు చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీశాడు. 15 ఐపీఎల్ మ్యాచ్ లో 303 పరుగులు చేశాడు. 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ కు ముందు నితీష్ కుమార్ రెడ్డిని రూ. 6 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది.
Nitish Kumar Reddy received his Test Cap from Virat Kohli ?
— Johns. (@CricCrazyJohns) November 22, 2024
- Kohli is his idol...!!!!! pic.twitter.com/lpht38Xp6x