గబ్బా వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో హై డ్రామా చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 33 ఓవర్ లో లబుషేన్ కు సిరాజ్ బౌలింగ్ చేస్తున్నాడు. అప్పటివరకు క్రీజ్ లో లబుషేన్ పాతుకుపోయాడు. 50 బంతులాడి భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఈ దశలో సిరాజ్ బెయిల్-స్విచ్ ట్రిక్ ఉపయోగించాడు. లబుషేన్ చూస్తుండగానే బెయిల్స్ మారుస్తూ కనిపించాడు. అయితే ఇది గమనించిన ఆసీస్ బ్యాటర్ బెయిల్స్ ను యధావిధిగా మార్చడం విశేషం.
ఈ పోరులో సిరాజ్ మైండ్ గేమ్ ఫలిచింది. నితీష్ కుమార్ వేసిన తర్వాత ఓవర్లో లబుషేన్ ఔటయ్యాడు. 34 ఓవర్ రెండో బంతికి ఆఫ్ సైడ్ కు దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడబోయి స్లిప్ లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. ఈ ఇన్నింగ్స్ లో 55 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆస్ట్రేలియా 40 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. క్రీజ్ లో స్మిత్ (23), హెడ్ (16) ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రాకు రెండు వికెట్లు.. నితీష్ కుమార్ రెడ్డికి ఒక వికెట్ దక్కింది.
Love Hate- Triangle Continues among #MohammedSiraj & Crowd @marnus3cricket
— alekhaNikun (@nikun28) December 15, 2024
Siraj changes the bails & then Labuschagne placed again.
Nitish Reddy Got wicket..#INDvAUS#bordergavaskartrophy2024 pic.twitter.com/vskCeCE9tU
బెయిల్-స్విచ్ ట్రిక్ అంటే.. వికెట్ రాని సమయంలో ఫీల్డింగ్ టీం ఈ ట్రిక్ ఉపయోగిస్తే వికెట్ పడుతుందనే సెంటిమెంట్ ఉంది. బెయిల్-స్విచ్ అంటే స్టంప్స్ మీద ఉన్న రెండు బెయిల్స్ మారుస్తారు. కొన్ని సందర్భాల్లో ఇది ఫలించడంతో ఈ ట్రిక్ బాగా ఫేమస్ అయింది. తాజాగా సిరాజ్ ఈ బెయిల్-స్విచ్ ట్రిక్ సెంటిమెంట్ ఫాలో అయ్యి సఫలమయ్యాడు.
Nitish Kumar Reddy with a wicket of Labuschagne and the celebration of Virat Kohli. ?pic.twitter.com/ryaiFWZUTA
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 15, 2024