బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సీఎం అవ్వాలని తాను కోరుకులేదని చెప్పారు. ఎవరైనా సీఎం అయ్యేలా ప్రజా తీర్పు ఉందన్నారు. కావాలనుకుంటే బీజేపీ తన స్వంత ముఖ్యమంత్రిని చేసుకోవచ్చన్నారు. నవంబర్ 10న వెలువడిన బిహార్ ఎన్నికల ఫలితాల్లో… నితీశ్ నేతృత్వంలోని JDU 43 సీట్లు మాత్రమే గెలిచి మూడో స్థానంలో నిలిచింది. 75 సీట్లతో RJD సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవగా… 74 సీట్లతో సెకండ్ పొజిషన్ లో బీజేపీ ఉంది. అయితే ఎన్నికలకు ముందే ప్రకటించినట్టుగా నితీశ్ ను సీఎం చేసింది బీజేపీ. అయితే కేబినెట్ సహా ఇతర అంశాల్లో బీజేపీనే ఆధిపత్యం చెలాయిస్తోంది. దీనిపై నితీశ్ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ లో ఈ మధ్యే ఆరుగురు JDU ఎమ్మెల్యేలను చేర్చుకుంది బీజేపీ. దీనిపై JDU నేతలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నితీశ్ వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
దేశంలో తొలిసారి పట్టాలెక్కిన డ్రైవర్ లెస్ మెట్రో ట్రైన్
