Robinhood: భీష్మ డైరెక్టర్తో నితిన్.. రాబిన్ హుడ్ టీజర్ రిలీజ్ అనౌన్స్‌

బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు నితిన్ (Nithiin). ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో వెంకీ కుడుముల(Venkykudumula) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం రాబిన్ హుడ్. తాజాగా ఈ మూవీకి సంబంధించి టీజర్ రిలీజ్ అనౌన్స్‌‌మెంట్‌‌ ప్రకటించారు మేకర్స్.

"రాబిన్ హుడ్ టీజర్ నవంబర్ 14న సాయంత్రం 4:05 గంటలకు రాబోతుంది.. అడ్వెంచరస్ ఎంటర్‌టైనర్ మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయబోతుంది!" అంటూ నితిన్ పోస్టర్ షేర్ చేశారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్, టైటిల్ చూస్తుంటే..రాబిన్ హుడ్ తరహాలోనే..జనాల నుంచి సొమ్మును కాజేసే క్యారెక్టర్లో హీరో నితిన్ కనిపిస్తాడని తెలుస్తోంది. 

Also Read:-షారుఖ్ ఖాన్‌ హత్య బెదిరింపుల కేసులో న్యాయవాది అరెస్ట్

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ జంట ఇటీవలే ఎక్స్ ట్రా మూవీలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా అయినా నితిన్ కు హిట్ తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.