నీతి ఆయోగ్ న్యూఇయర్ ప్లాన్స్

నీతి ఆయోగ్ న్యూఇయర్ ప్లాన్స్
ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రమోట్ చేయాలి టెక్స్‌‌‌‌‌‌టైల్‌‌‌‌కు బూస్టప్ ఇవ్వాలి నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ న్యూఢిల్లీ: కొత్త ఏడాది వచ్చేస్తోంది. న్యూఇయర్‌‌‌‌‌‌‌‌‌‌లో చేయాల్సిన పనులకు  నీతి ఆయోగ్ ముందస్తుగానే లిస్ట్ రెడీ చేసి పెట్టుకుంది. ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత ప్రమోట్ చేయడంతో పాటు.. టెక్స్‌‌‌‌టైల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌కు బూస్టప్ ఇవ్వడం, కుటీర, చిన్న, మధ్య తరహా సంస్థలకు క్రెడిట్ యాక్సస్‌‌‌‌ను మెరుగుపర్చడం, నీళ్లను పొదుపు చేయడం వంటి చర్యలను అమలు చేయాలని నీతి ఆయోగ్ నిర్ణయించింది. సస్టైనబుల్ ఎకనమిక్ గ్రోత్ కోసం ప్రభుత్వ సంస్కరణల అజెండాను తీసుకురావాలని కోరింది. దేశ ఎకానమీని పెంచేందుకు పలువురు స్టేక్‌‌‌‌హోల్డర్స్‌‌‌‌తో కలిసి పనిచేస్తున్నట్టు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్, ఎకనమిస్ట్ రాజీవ్ కుమార్ తెలిపారు. కరోనా క్రైసిస్ నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు రకాల చర్యలు తీసుకుందని, వచ్చే ఏళ్లలో సస్టైనబుల్ గ్రోత్‌‌‌‌కు ఇవి పునాదులుగా నిలవనున్నట్టు పేర్కొన్నారు. వచ్చే కొత్త ఏడాదిలో సంస్కరణల అజెండాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నీతి ఆయోగ్  చూస్తోందని తెలిపారు. వీటిలో ఎక్కువగా ఎలక్ట్రిక్ మొబిలిటీపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. అంతేకాక మెగా టెక్స్‌‌‌‌టైల్ సంస్థలను ఏర్పాటు చేసేందుకు టెక్స్‌‌‌‌టైల్ ఇండస్ట్రీతో కొలాబరేట్ అయి పనిచేస్తున్నామని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్ కుమార్  పేర్కొన్నారు. ఈ మెగా టెక్స్‌‌‌‌టైల్ సంస్థలు ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో పోటీని పెంచుతాయని చెప్పారు. అంతేకాక మన ఫ్యాబ్రిక్, గార్మెంట్ సెక్టార్ల ఎక్స్‌‌‌‌పోర్ట్స్‌‌‌‌ను పెంచొచ్చని తెలిపారు. వీటిపైనే కాక ఆత్మనిర్భర్ భారత్‌‌‌‌కు పిల్లర్స్‌‌‌‌లో ఒకటైన కుటీర, చిన్న, మధ్య సంస్థలకు క్రెడిట్ యాక్సస్‌‌‌‌ను మెరుగుపర్చాలని కూడా నిర్ణయించినట్టు చెప్పారు. వాటర్ కన్జర్వేటివ్ చర్యలను కూడా నీతి ఆయోగ్ తన లిస్ట్‌‌‌‌లో చేర్చింది. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడమే కేంద్ర ప్రభుత్వం ముందున్న లక్ష్యమని కుమార్ చెప్పారు. దీని కోసం నీతి ఆయోగ్ కూడా పనిచేస్తోందన్నారు. ‘ప్రస్తుతం నీతి ఆయోగ్ ఐసీఏఆర్, ఇతర అగ్రికల్చర్ యూనివర్సిటీలతో పనిచేస్తోంది. ఫీల్డ్ ట్రయల్స్‌‌‌‌ను చేపడుతోంది. నేచురల్ ఫార్మింగ్ ద్వారా రైతులకు వచ్చే ప్రయోజనాలను ఈ ఫీల్డ్ ట్రయల్స్ ద్వారా పరిశీలిస్తోంది’ అని కుమార్ తెలిపారు. ఇప్పటికే పలు దేశాల్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ విధానాలను ఇక్కడ కూడా ప్రమోట్ చేయనున్నట్టు చెప్పారు. వ్యాక్సిన్ సప్లయిలో కీలకపాత్ర… కరోనా  వైరస్ వ్యాక్సిన్ సప్లయిలో కూడా నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషించనుందని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌ కోసం ఏర్పాటైన నేషనల్ ఎక్స్‌‌‌‌పర్ట్ గ్రూప్‌‌‌‌కు నీతి ఆయోగ్ మెంబర్ వీకే పాల్ హెడ్‌‌‌‌గా ఉన్నారు. కరోనా క్రైసిస్‌‌‌‌ను తాము ఒక అవకాశంగా మలుచుకున్నామని కుమార్ తెలిపారు. కరోనా క్రైసిస్ నుంచి ఎకానమీ కోలుకుందని, తాము అంచనావేసిన దానికంటే మెరుగ్గానే రికవరీ అయిందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు క్వార్టర్‌‌‌‌‌‌‌‌లలో బాగా పడిపోయిన ఎకానమీ.. వచ్చే జనవరి–మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌ లో పాజిటివ్ గ్రోత్‌‌‌‌ను నమోదు చేస్తుందని అంచనావేశారు.  గ్లోబల్‌‌‌‌గా ఇండియన్ కంపెనీలు మరింత పోటీపడేలా ఫోకస్ చేశామని, అంతర్జాతీయ స్థాయిని కంపెనీలు అందుకునేలా సహకరించనున్నామని చెప్పారు. లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించేందుకు, అన్ని యూనిట్లకు క్రెడిట్ యాక్సస్‌‌‌‌ను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం  చూస్తుందని పాల్ చెప్పారు. For More News.. రోహిత్ ఆడాలంటే మరోకరిపై వేటు పడాల్సిందే..