పారిస్ పారాలింపిక్స్ బ్యాడ్మింటన్ ఎస్‌ఎల్ 3 విభాగంలో భారత్ గోల్డ్ మెడల్ గెలిచింది. సోమవారం (సెప్టెంబర్ 2) పారిస్‌లోని లా చాపెల్లె ఎరీనా కోర్ట్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో నితేష్ కుమార్ కుమార్ గెలిచి భారత్ కు పసిడి పతకాన్ని అందించాడు. హోరాహోరీగా సాగిన ఈ ఫైనల్లో గ్రేట్ బ్రిటన్‌కు చెందిన డేనియల్ బెథెల్‌ను 21-14, 18-21,21-12 తేడాతో గెలిచి చరిత్ర సృష్టించాడు. ఇద్దరు పారా షట్లర్ల మధ్య జరిగిన చివరి 10 మ్యాచ్ ల్లో బెథెల్‌పై నితేష్‌కి ఇదే తొలి విజయం కావడం విశేషం.
గంట 20 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో తొలి గేమ్ ను నితేష్ 21-14 తేడాతో అలవోకగా నెగ్గాడు. రెండో సెట్ లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతి ఘటన ఎదురైంది. కీలక దశలో తప్పిదాలు చేస్తూ 18-21 తేడాతో రెండో గేమ్ ను చేజార్చుకున్నాడు. నిర్ణయాత్మకమైన మూడో సెట్ లో మొదటి నుంచి పుజుకున్న నితేష్ 21-12 తేడాతో గేమ్ తో పాటు.. మ్యాచ్ ను.. గోల్డ్ మెడల్ ను గెలుచుకున్నాడు. రాజస్థాన్‌లో జన్మించిన నితేష్.. ఐఐటీ గ్రాడ్యుయేట్. ప్రస్తుతం హర్యానాలో నివసిస్తున్నాడు. 2009లో జరిగిన రైలు ప్రమాదం జరగడంతో తన కాలును కోల్పోయాడు.
??? NITESH KUMAR DOES IT! He brings home the gold in Men's Singles SL3.
— The Bharat Army (@thebharatarmy) September 2, 2024
? Congratulations, champ!
? Pics belong to the respective owners • #NiteshKumar #Badminton #ParaBadminton #Paris2024 #Paralympics #TeamIndia #BharatArmy #COTI?? pic.twitter.com/rfjrx4nnGe