చీర, నగలతో పెండ్లి కూతురు మార్షల్‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌

చీర, నగలతో పెండ్లి కూతురు మార్షల్‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌
  • అదిరిపోయే కళలు ప్రదర్శించిన తమిళనాడు యువతి

న్యూఢిల్లీ: మంటపంలో పెండ్లి అయిపోయింది.. పిల్ల, పిలగాడు పీటల మీద నుంచి లేచిన్రు. కిందికి దిగి బాజాలకాడికి వచ్చిన్రు. పెండ్లికి వచ్చినోళ్లంతా చుట్టూ చేరి చూస్తుం టే.. చీర కాస్త సర్దుకున్న పెండ్లి కూతురు పొడవైన బ్లేడ్‌‌‌‌ లాంటి ఆయుధంతో ఔరా అనిపించేలా మార్షల్‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌ కళను ప్రదర్శించింది. సురుల్‌‌‌‌ వాల్‌‌‌‌ వీచు, రెట్టయ్‌‌‌‌ కంబు, అడిమరయ్‌‌‌‌ కళలు చూపించింది. ఆపై అదిరిపోయేలా కర్రసాము చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌‌‌‌ మీడియాలో వైరల్​ అయింది. తమిళనాడు తూత్తుక్కుడి జిల్లాలోని తిరుకోలూర్‌‌‌‌లో ఇటీవల ఈ సంఘటన జరిగింది. ఆ పెండ్లి కూతురు పేరు నిషా(22). మామ రాజ్ కుమార్‌‌‌‌ (29) తో పెళ్లి జ‌‌‌‌రిగిం ది. నిషాకు రాజ్​కుమారే మూడేండ్ల నుంచి ఆ కళలు నేర్పించాడు. నిషా మాట్లాడుతూ.. ‘సిలబమ్‌‌‌‌, సురుల్‌‌‌‌ వాల్‌‌‌‌, అడిమరయ్‌‌‌‌, కలరియపట్టు కళలను మూడేళ్ల నుంచి నేర్చుకుంటు న్నా. పెండ్లికూతురు మేకప్‌‌‌‌లో చీర, నగలతో మార్షల్‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌ చేయడం కష్టం. మాములూగా టీ షర్ట్‌‌‌‌, ట్రాక్‌‌‌‌ పాయింట్‌‌‌‌తో నేను ప్రాక్టీస్‌‌‌‌ చేసేదాన్ని’ అని చెప్పారు.