దివాళీ సీజన్ లో ఎకానమీ గాడిన పడుతుంది: నిర్మలా సీతారామన్

దివాళీ సీజన్ లో ఎకానమీ గాడిన పడుతుంది: నిర్మలా సీతారామన్

మార్కెట్లో  లిక్విడిటీ కొరత లేదన్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. లిక్విడిటీ కొరత హోల్ సేల్ ఫైనాన్సింగ్ లో ఉంది తప్పా.. రిటైల్ ఫైనాన్సిం గ్ లో లేదన్నారు. దేశంలోని ప్రైవేటు బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రోఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. లిక్విడిటీ, రేట్ కోత, అప్పుల డిస్బర్స్ మెంట్ వంటి కీలకాంశాలపై చర్చించారు. లిక్విడిటీ కొరత ఉందని మీటింగ్ లో ఏ ఒక్కరూ ప్రస్తావించలేదన్నారు మంత్రి నిర్మలా సీతారామన్. రాబోయే పండుగ సీజన్ తో ఎకానమీ గాడిన పడుతుందనే ధీమా వ్యక్తం చేశారు.