రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. రాజధాని నిర్మాణం, రాజధానిపై ప్రజలకు ఉన్న అనుమానాలపై అసెంబ్లీలో చర్చజరిగింది. చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేపట్టారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన సీఎం జగన్ మాట్లాడుతూ సభ సజావుగా జరగనీయుకుండా నినాదాలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేల్ని సస్పెన్షన్ విధించాలని సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని సీతారామ్ ను కోరారు.
జగన్ విన్నపంపై స్పందించిన స్పీకర్ మాట్లాడుతూ రాజధాని నిర్మాణం గురించి ప్రజల్లో ఉన్న అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని, కానీ టీడీపీ ఎమ్మెల్యేలు సభ జరగకుండా అడ్డుకుంటున్నారని తెలుపుతూ
నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, రామకృష్ణబాబు, అశోక్, బాలవీరాంజనేయులు, వై. సాంబశివరావు, మద్దాల గిరి, అనగాని సత్య ప్రసాద్,గద్దె రామ్మోహన్ లను ఒక్కరోజు సస్పెన్షన్ విధించారు.
