టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్పకు.. తప్పిన ప్రమాదం

టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్పకు పెను ప్రమాదం తప్పింది.  ఇవాళ టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే.  పెద్దాపురం నియోజకవర్గానికి టీడీపీ, -జనసేన ఉమ్మడి అభ్యర్థిగా చినరాజప్పను చంద్రబాబు ప్రకటించారు. ఈ క్రమంలో  పెద్దాపురంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. 

 అయితే అకస్మాత్తుగా   చిన్నరాజప్ప కారుకు ఓ వ్యక్తి అడ్డురావడంతో డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో వాహనం అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కింది. ప్రమాద సమయంలో చినరాజప్ప కారులోనే ఉన్నారు. దీంతో వెంటనే ఆప్రమత్తమైన కార్యకర్తలు  కారును డివైడర్‌ పైనుంచి కిందకు దించారు.  ఈ ఘటనలో ఎవరకీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు.