- మెదక్ జిల్లా సూరారంలో విషాదం
చిన్నశంకరంపేట, వెలుగు : మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన నిఖిల్ (17) డెంగ్యూతో చికిత్స పొందుతూ చనిపోయాడు. గ్రామానికి చెందిన కుమ్మరి వెంకటేశ్, సరస్వతి దంపతుల పెద్ద కొడుకు నిఖిల్ (17) హైదరాబాద్ బాచుపల్లిలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. నిఖిల్ కి రెండు రోజుల కింద జ్వరం రావడంతో ఊరికి వచ్చాడు.
కుటుంబసభ్యులు స్థానిక డాక్టర్లకు చూపించి మందులు వాడినా తగ్గలేదు. దీంతో హైదరాబాద్ శివారులోని కొంపల్లిలో ఉన్న ఓ ప్రైవేట్ దవాఖానలో జాయిన్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ఫిట్స్ రావడంతో చనిపోయాడు. మెడికల్ రిపోర్టుల ఆధారంగా నిఖిల్‌కు డెంగ్యూ సోకినట్లు చిన్న శంకరంపేట మండలం మెడికల్ ఆఫీసర్ సాయి సింధు తెలిపారు.