తాత్కాలిక లాక్‌‌డౌన్, నైట్ కర్ఫ్యూతో ఒరిగేదేం లేదు

తాత్కాలిక లాక్‌‌డౌన్, నైట్ కర్ఫ్యూతో ఒరిగేదేం లేదు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాల్లో వైరస్ పాజిటివ్‌ల సంఖ్య అమాంతం ఎక్కువవుతోంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో లాక్‌‌డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య మరింతగా పెరిగితే దేశవ్యాప్త లాక్‌‌డౌన్ విధింపునకు అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్దన్ స్పందించారు. తాత్కాలిక లాక్‌‌డౌన్‌‌లు, రాత్రి పూట కర్ఫ్యూలతో పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి సోషల్ డిస్టెన్సింగ్ నియమాలను పక్కాగా పాటించాల్సిందేనని సూచించారు. కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌‌లో వయస్సుల వారీగా లిమిట్‌‌ను తగ్గిస్తూ ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. తొలుత ఎక్కువ రిస్క్ కలిగిన వారిని కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. సైంటిఫిక్ గైడెన్స్‌తోనే దేశంలో కరోనాను ఎలా ఎదుర్కోవాలనే దానిపై కసరత్తులు చేస్తున్నామని పేర్కొన్నారు.