5 సెషన్లలో రూ.19 లక్షల కోట్లు మాయం!

5 సెషన్లలో రూ.19 లక్షల కోట్లు మాయం!

న్యూఢిల్లీ: వరసగా ఐదో సెషన్‌‌‌‌‌‌‌‌లోనూ దేశ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. యూఎస్ ఏప్రిల్ ఇన్‌‌‌‌ఫ్లేషన్ అంచనాల కంటే ఎక్కువగా నమోదుకావడంతో గ్లోబల్‌‌‌‌ మార్కెట్లతో పాటే మన మార్కెట్లు పడ్డాయి.  ఇండెక్స్‌‌‌‌లు పడడానికి రూపాయి పతనం కూడా కారణంగా చెప్పొచ్చు. సెన్సెక్స్‌‌‌‌ గురువారం 1,158 పాయింట్లు నష్టపోయి (2.14 %) 52,930 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ  359 పాయింట్లు (2.22 %) తగ్గి 15,808 వద్ద ముగిసింది. గత ఐదు సెషన్లలో రూ.  18.74 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తగ్గింది. యూఎస్‌‌‌‌ ఏప్రిల్ ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌ 8.3 శాతంగా రికార్డయ్యింది. మార్చి నెలలో నమోదైన 8.5 శాతంతో పోలిస్తే పెద్దగా తగ్గకపోవడంతో యూఎస్ మార్కెట్‌‌‌‌లు బుధవారం నష్టపోయాయి. దీని ప్రభావం గురువారం సెషన్‌‌‌‌లో గ్లోబల్‌‌‌‌ మార్కెట్లపై పడింది. యూఎస్  ఇన్‌‌‌‌ఫ్లేషన్ డేటా అంచనాల కంటే ఎక్కువగా ఉందని, సమీప భవిష్యత్‌‌‌‌లో వ్యవస్థలో ఇన్‌‌‌‌ఫ్లేషన్ ఒత్తిడి ఉంటుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్‌‌‌‌ నాయర్ అన్నారు. ఈ మధ్య కాలంలో పెరిగిన క్రూడాయిల్‌‌‌‌, ఇతర కమోడిటీ రేట్లతో పాటే ఇన్‌‌‌‌ఫ్లేషన్  కూడా దిగొస్తుందని అభిప్రాయపడ్డారు.