‘మా ఎమ్మెల్యే కనిపించడం లేదు.. వెతికి పెట్టండి’

‘మా ఎమ్మెల్యే కనిపించడం లేదు.. వెతికి పెట్టండి’
  • ఆళ్ల  రామకృష్ణా రెడ్డి కనిపించడం లేదంటున్న నిడమర్రు రైతులు
  • వెతికి పెట్టాలని మంగళగిరి పీఎస్ లో ఫిర్యాదు

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కనిపించడం లేదంటూ మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు నిడమర్రు రైతులు. ఓవైపు అమరావతి రాజధాని తరలిపోతుందని రైతులు ఆందోళనలు చేస్తుంటే.. మరోవైపు తమ ఎమ్మెల్యే అడ్రస్ లేకుండా పోయారంటున్నారు రైతులు. దీంతో ఆయన కనిపిస్తే వెతికి పెట్టడంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు.

‘రాజధానిపై నెలకొన్న సందిగ్దతపై మా గోడు వెళ్లబుచ్చుకుందామంటే మా ఎమ్మెల్యే  ఎక్కుడున్నారో తెలియట్లేదు. మా ఎమ్మెల్యే కోసం తీవ్ర ఆందోళన చెందుతున్నాం. మీరు వెంటనే తగు చర్యలు తీసుకుని మా శాసభన సభ్యులను మాకు అప్పగిస్తారని భావిస్తున్నాం. గత వారం రోజుల నుంచి మంగళగిరి నియోజకవర్గంలో గానీ.. ఆయన కార్యాలయంలోగానీ.. నివాసంలో గానీ ఎక్కడా ఆయన కనిపించట్లేదు. మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. కావున వెంటనే ఆయన్ను వెతికి మాకు అప్పగించాల్సిందిగా కోరుతున్నాము’ అని ఫిర్యాదులో రాజధాని రైతులు, రైతు కూలీలు పేర్కొన్నారు. ఈ మేరకు ఫిర్యాదు పత్రంలో రాజధాని రైతులు, కూలీలు సంతకాలు కూడా చేశారు. అనంతరం మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు అందించారు.