లక్నో: ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అమ్మాయికి అర్జెంటుగా రక్తం ఎక్కించాలన్నరు డాక్టర్లు.. టైమ్‌కు డోనర్లేమో దొరకలే. ఏంచేయాల్నా అని అమ్మాయి పేరెంట్స్ తండ్లాడుతుం టే ఓ జంట ముందుకొచ్చింది. పెండ్లి పీటల మీదినుంచి నేరుగా ఆస్పత్రికి చేరుకుంది. రక్తం ఇచ్చాక మంటపానికి తిరిగెళ్లింది. ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఫొటోను అక్కడి పోలీస్ కమిషనర్ ఆశిష్ మిశ్రా ట్విట్టర్లో షేర్ చేశారు. దీంతో నెట్టింట్లో ఆ ఫొటో వైరల్ అయింది. కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెప్పారు. అయితే, ఈ జంట వివరాలను మిశ్రా వెల్లడించలేదు.
