మియపూర్: ఆన్లైన్లో విషం ఆర్డర్ చేసి తాగి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. భర్త వేధింపులు, మనస్పర్థలు కారణంగా నాగలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. 5 నెలల క్రితమే కాంట్రాక్టర్ మనోజ్‌తో నాగలక్ష్మికి వివాహం అయింది. పెళ్లైన కొత్తలో అంతా బానే ఉన్నప్పటికీ ఇటీవల తరచూ ఇద్దరు మధ్య గొడవలు జరిగాయి. దీంతో.. క్షణికావేశంలో నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.
ఆన్లైన్లో విష పదార్థాలు ఆర్డర్ చేసుకున్న నాగలక్ష్మి ఆ విషం తాగేసింది. గురువారం ఉదయం నాగలక్ష్మి చనిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. నాగలక్ష్మి తల్లితండ్రులు భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.