పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు నవ్ జోత్ సింగ్ సిద్ధు. చండీగఢ్ లోని పంజాబ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, తాజా మాజీ పీసీసీ అధ్యక్షుడు సునీల్ జఖర్ సహా కీలక నేతల సమావేశంలో బాధ్యతలు తీసుకున్నారు సిద్ధు. పంజాబ్ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ హరీష్ రావత్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు టీ పార్టీ ఇచ్చారు సీఎం అమరీందర్ సింగ్. సిద్ధు కూడా టీ పార్టీలో పాల్గొన్నారు. ఇద్దరు పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోవడం కనిపించింది. ప్రసంగించే ముందు నవ్ జోత్ సింగ్ బ్యాటింగ్ శైలిని అనుకరించారు.
#WATCH: Newly appointed Punjab Congress president Navjot Singh Sidhu mimics a batting style as he proceeds to address the gathering at Punjab Congress Bhawan in Chandigarh.
— ANI (@ANI) July 23, 2021
(Source: Punjab Congress Facebook page) pic.twitter.com/ZvfXlOBOqi
