IND vs NZ 3rd Test: ఈ ఎండ తట్టుకోలేం: ముంబై టెస్టులో సూర్యుడి ధాటికి కివీస్ విల విల

ముంబై వేదికగా భారత్ తో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో న్యూజిలాండ్  ప్లేయర్లు ఎండ భరించలేకపోయారు. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో శుక్రవారం (నవంబర్ 1) ఉష్ణోగ్రతలు ఉత్తరాన 30 డిగ్రీలకు చేరుకుంది. ఒకానొక దశలో ఉష్ణోగ్రత 33 డిగ్రీలకు చేరుకోవడంతో న్యూజిలాండ్ ప్లేయర్లు మైదానంలో బ్యాటింగ్ చేయలేక ఇబ్బంది పడ్డారు. ఎండ కారణంగా ఆటగాళ్ళు పదేపదే డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు.మైదానంలో ఉన్నవారికి బెంచ్ మీద ఉన్న ప్లేయర్లు డ్రింక్స్, టవల్స్ తెచ్చే పనిలో ఉన్నారు. 

న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లేతమ్ గ్రౌండ్ లో గొడుగు తెప్పించుకున్నాడు. డారిల్ మిచెల్, విల్ యంగ్ ఎండ తాకిడికి కుదేలయ్యారు. బ్యాటింగ్ చేయడానికి బాగా ఇబ్బంది పడినట్టు కనిపిస్తుంది. కివీస్ ప్లేయర్లు టవల్స్, బాటిల్స్ తెప్పించుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నారు. భారత ప్లేయర్లు సైతం ఎండ ధాటికి విల విల్లాడారు. ఈ మ్యాచ్ లో అంపైర్లు పదే పదే అంపైర్లు బ్రేక్ ఇస్తూ వచ్చారు. 

ఈ మ్యాచ్  విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 235 పరుగులకే ఆలౌట్ కాగా.. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ తడబడుతుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. క్రీజ్ లో పంత్ (1), గిల్ (31) ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఇంకా 149 పరుగులు వెనకబడి ఉంది.