IND Vs NZ: మర్చిపోలేని క్షణాలు: ఒకే రోజు న్యూజిలాండ్ రెండు చారిత్రాత్మక విజయాలు

2024 అక్టోబర్ 20.. న్యూజీలాండ్ క్రికెట్ చరిత్రలో మర్చిపోలేని రోజు. మధ్యాహ్నం మెన్స్ క్రికెట్ భారత గడ్డపై 36 ఏళ్ళ తర్వాత టెస్ట్ విజయాన్ని అందుకొని టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చింది. ఆదివారం (అక్టోబర్ 20) ముగిసిన మ్యాచ్ లో అద్భుతంగా ఆడుతూ బెంగళూరు టెస్టులో 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. దీంతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. చివరిసారిగా కివీస్ 1988 లో భారత్ పై ముంబైలో టెస్ట్ మ్యాచ్ గెలిచింది. ఆ తర్వాత ఈ 36 ఏళ్లలో ఓడిపోవడం లేదా డ్రా చేసుకోవడమే సరిపోయింది.

ఇండియా ఇచ్చిన 107 రన్స్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌ను కివీస్ రెండు వికెట్లు కోల్పోయి ఛేజ్‌‌‌‌‌‌‌‌ చేసింది. బుమ్రా దెబ్బకు టామ్ లాథమ్ (0), డెవాన్ కాన్వే (17) ఔటైనా  విల్‌‌‌‌‌‌‌‌ యంగ్‌‌‌‌‌‌‌‌ (48 నాటౌట్‌‌‌‌‌‌‌‌) రచిన్ రవీంద్ర (39 నాటౌట్‌‌‌‌‌‌‌‌) మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 75 రన్స్ జోడించి తమ జట్టును గెలిపించారు.  ఇండియాలో ఆడిన 37 టెస్టుల్లో  న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌కు ఇది మూడో విజయం. ఇది వరకు 1969 నాగ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, 1988లో ముంబైలో గెలిచింది. ఇండియా గడ్డపై వంద రన్స్ పైచిలుకు టార్గెట్‌‌‌‌‌‌‌‌ను పర్యాటక జట్టు ఛేదించడం 24 ఏండ్లలో ఇదే తొలిసారి.

 ALSO READ | Ranji Trophy: సన్ రైజర్స్ బ్యాటర్ విధ్వంసం: 15 సిక్సులు.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు

ఈ విజయానందాన్ని రెట్టింపు చేస్తూ రాత్రి న్యూజిలాండ్ మహిళల జట్టు టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. దీంతో విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో తొలిసారి విజేతగా నిలిచింది. 2009, 2010 ఎడిషన్లలో ఫైనల్లో ఓడిన కివీస్‌‌‌‌.. తమ మూడో ఫైనల్లో మెప్పించి ఎట్టకేలకు టీ20 కిరీటాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు వరుసగా రెండోసారి ఫైనల్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన సౌతాఫ్రికాకు మళ్లీ నిరాశే మిగిలింది. ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్ షోతో అదరగొట్టిన కివీస్ ఆదివారం జరిగిన ఫైనల్లో 32 రన్స్ తేడాతో సఫారీలను ఓడించింది. ఈ రెండు విజయాలతో న్యూజిలాండ్ దేశంలో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.