IND vs NZ 2nd Test: భారత్‌కు టెన్షన్.. 200 పరుగులకు చేరువలో కివీస్ ఆధిక్యం

న్యూజిలాండ్ తో పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తడబడుతుంది. తొలి సెషన్ లో బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైన మన జట్టు.. బౌలింగ్ లో వికెట్లు తీయడానికి తడబడుతుంది. రెండో రోజు టీ విరామ సమయానికి న్యూజిలాండ్ 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. క్రీజ్ లో రచీన్ రవీంద్ర (7), టామ్ లేతమ్ (37) ఉన్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ ఆధిక్యం 188 పరుగులకు చేరుకుంది. మూడో సెషన్ లో భారత్ వీలైనంత వేగంగా వికెట్లు తీయకపోతే భారత్ ఈ మ్యాచ్ గెలవటానికి శ్రమిచాల్సిందే.

భారత్ ను తక్కువగా ఆలౌట్ చేసి ఫుల్ జోష్ మీదున్న న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించింది. తొలి ఓవర్ నుంచే ఓపెనర్లు కాన్వే, లేతమ్ కౌంటర్ ఎటాక్ చేశారు. మరోవైపు భారత్ పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుండడంతో తొలి ఓవర్ నుంచే అశ్విన్ ను రంగంలోకి దింపింది. తొలి వికెట్ కు 36 పరుగులు జోడించిన తర్వాత కాన్వే (17)ను ఎల్బీడబ్ల్యూ రూపంలో సుందర్ ను వెనక్కి పంపాడు.  లేతమ్ తో కలిసి 42 పరుగులు జోడించిన తర్వాతే యంగ్ (23) ను అశ్విన్ ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ కు పంపాడు. 

ALSO READ | IND vs NZ 2nd Test: ఏడు వికెట్లతో సాంట్నర్ విజృంభణ.. తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన భారత్

తొలి సెషన్ లో ఆరు వికెట్లు తీసి భారత్ పై ఆధిపత్యం చెలాయించిన భారత్.. రెండో సెషన్ లో 3 వికెట్లు తీయడంతో పాటు 85 పరుగులు చేసింది. అంతకముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ కేవలం 156 పరుగులకే ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో సాంట్నర్ కు 7 వికెట్లు తీసుకున్నాడు. ఫిలిప్స్ రెండు వికెట్లు దక్కగా.. సౌథీ ఒక వికెట్ తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 259 పరుగులు చేసింది.