తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌లో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ భారీ స్కోరు

గాలె : శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌లో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ భారీ స్కోరు దిశగా సాగుతోంది. టామ్‌‌‌‌‌‌‌‌ లాథమ్‌‌‌‌‌‌‌‌ (70), విలియమ్సన్‌‌‌‌‌‌‌‌ (55) హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీలు చేయడంతో.. గురువారం రెండో రోజు ఆట ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌కు కివీస్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 72 ఓవర్లలో 255/4 స్కోరు చేసింది. డారిల్‌‌‌‌‌‌‌‌ మిచెల్‌‌‌‌‌‌‌‌ (41 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), టామ్‌‌‌‌‌‌‌‌ బ్లండెల్‌‌‌‌‌‌‌‌ (18 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. డేవన్‌‌‌‌‌‌‌‌ కాన్వే (17) ఫెయిలైనా, రాచిన్‌‌‌‌‌‌‌‌ రవీంద్ర (39) ఫర్వాలేదనిపించాడు. 

ధనంజయ 2 వికెట్లు తీశాడు. అంతకుముందు 302/7 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 91.5 ఓవర్లలో 305 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. రమేశ్‌‌‌‌‌‌‌‌ మెండిస్‌‌‌‌‌‌‌‌ (14), ప్రభాత్‌‌‌‌‌‌‌‌ జయసూరియా (0), లాహిర్‌‌‌‌‌‌‌‌ కుమార (2 నాటౌట్‌‌‌‌‌‌‌‌), అషితా ఫెర్నాండో (0) నిరాశపర్చారు. విలియమ్‌‌‌‌‌‌‌‌ ఓ రౌర్కి 5 వికెట్లు తీశాడు. ప్రస్తుతం కివీస్‌‌‌‌‌‌‌‌ ఇంకా 50 రన్స్‌‌‌‌‌‌‌‌ వెనకబడి ఉంది.