IND vs NZ 2024: కివీస్‌కు కొత్త కెప్టెన్.. టీమిండియా సిరీస్‌కు న్యూజిలాండ్ స్క్వాడ్ ప్రకటన

భారత్ తో జరగబోయే మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు న్యూజిలాండ్ క్రికెట్ తమ జట్టును ప్రకటించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (2023-25) లో భాగంగా ఇరు జట్లకు ఇది కీలక సిరీస్. ఈ సిరీస్‌కు టామ్ లాథమ్ తొలిసారిగా పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్‌గా జట్టును నడిపించనున్నాడు. ఇటీవల శ్రీలంకలో 0-2 తేడాతో ఓడిన తర్వాత టిమ్ సౌథీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో   లాథమ్ ను కెప్టెన్ గా ప్రకటించారు. 

శ్రీలంకతో ఆడిన జట్టుతోనే కివీస్ భారత్ లోకి అడుగుపెడుతుంది. స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ గజ్జల్లో గాయం కారణంగా భారత్ కు రావడం ఆలస్యం కానున్నట్టు సమాచారం. దీనితో అతనికి బ్యాకప్ గా మార్క్ చాప్‌మన్‌ను స్క్వాడ్‌లో చేర్చారు. అక్టోబర్ 16న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి టెస్ట్ తో సిరీస్ ప్రారంభం కానుంది.అక్టోబర్ 24న పుణేలో రెండో టెస్ట్.. నవంబర్ 1న ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో మూడో టెస్ట్ జరుగుతుంది.

Also Read:-తొలి రౌండ్‌‌‌‌లో సింధుకు నిరాశ

భారత్ తో టెస్ట్ సిరీస్ కు న్యూజిలాండ్ జట్టు:  

టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్ (తొలి టెస్టుకు మాత్రమే), మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్క్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, బెన్ సియర్స్, ఇష్ సోధి (రెండు, మూడు టెస్టులకు)టిమ్ సౌథీ, కేన్ విలియమ్సన్, విల్ యంగ్