NZ vs ENG: క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: గ్రౌండ్‌లోకి ప్రేక్షకులని అనుమతించిన న్యూజిలాండ్

క్రికెట్ చరిత్రలో అద్భుతమైన సంఘటన ఒకటి జరిగింది. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఫ్యాన్స్ కు న్యూజి లాండ్ క్రికెట్ ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో మొదటి రోజు చాలా మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులని గ్రౌండ్ లోపలి ఆహ్వానించారు. లంచ్ బ్రేక్ సమయంలో ఈ సంఘటన జరిగింది. గ్రౌండ్ లోపలికి వచ్చిన కొంతమంది అభిమానులు సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తే.. మరింకొంతమంది  సరదాగా క్రికెట్ ఆడుతూ కనిపించారు.

క్రికెట్ చరిత్రలో స్టేడియంలో అభిమానులను ఇలా గ్రౌండ్ లోకి ఆహ్వానించడం ఇదే తొలిసారి. గ్రౌండ్ లోకి ప్రేక్షకులు రాగానే వారి ఆనందానికి అవధులు లేవు. న్యూజిలాండ్ క్రికెట్ చూపించిన ఈ మంచితనానికి నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు తమ అధికారిక ఎక్స్ ద్వారా ఈ సరదా సన్నివేశాన్ని క్యాచ్ చేసి పోస్ట్ చేసింది.  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారుతుంది.  

ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి ఇంగ్లాండ్ ఫీల్డింగ్ తీసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. క్రీజ్ లో గ్లెన్ ఫిలిప్స్ (41), సౌతీ (10) ఉన్నారు. కేన్ విలియంసన్ 93 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. 7 పరుగుల వ్యవధిలో అతను తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇంగ్లాండ్  బౌలర్లలో షోయబ్ బషీర్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. కార్స్, అట్కిన్సన్ కు తలో రెండు వికెట్లు దక్కాయి.