హైదరాబాద్, వెలుగు: జనవరి 1 నుంచి ‘మెగా శాలరీ డేస్’ ఈవెంట్‌ను ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్ ఇండియా చేపట్టనుంది. ఈ ఈవెంట్ జనవరి 3 న ముగుస్తుంది. చిన్న, పెద్ద హోం అప్లెయెన్స్‌లు, టీవీలు, ఫర్నిచర్‌లు, స్పోర్ట్స్ ప్రోడక్ట్‌లు వంటి వాటిపై ఆఫర్లను ప్రకటించింది. నోకాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపింది. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులు, క్రెడిట్‌కార్డు ఈఎంఐలపై 10 శాతం వరకు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను పొందొచ్చని పేర్కొంది. అంతేకాక ఆర్థిక సంవత్సరం 2019–20 లో ఇండియాలో రూ. 11,400 కోట్లను ఇన్వెస్ట్ చేశామని కూడా అమెజాన్ పేర్కొంది. ఇక్కడ కంపెనీల్లో నష్టాలు వచ్చినా అమెజాన్ ఈ డబ్బులను అందించింది.
For More News..
ఇంకా అందని వరదసాయం.. రోడ్డు మీదే వంట చేసుకుంటున్న బాధితులు
ఇయర్ ఎండ్ సేల్స్‌తో జోరందుకున్న ఆన్‌లైన్ షాపింగ్
