కొత్త సందడి..వరంగల్ జిల్లాలో జోష్ గా న్యూ ఇయర్​ సంబరాలు

హనుమకొండ, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్నంటాయి. యూత్ డ్యాన్సులు చేస్తూ 2024 కు గుడ్ బై చెప్పారు. డ్యాన్సులు, కేరింతల మధ్య 2025 కొత్త ఏడాది గ్రాండ్ గా వెల్ కం చెప్పారు. కేకులు కోసి ఒకరికొకరు విషెస్ చెప్పుకున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో బేకరీలు, రెస్టారెంట్లు, హోటళ్లు కిటకిటలాడగా, యువత సంబరాలతో సందడి నెలకొంది.

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు.  కాగా రాజకీయ ప్రముఖులు, ఆఫీసర్లు ఉమ్మడి జిల్లా ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు.