ఖమ్మంలో న్యూ ఇయర్ జోష్..

గతేడాదికి స్వస్తి పలికి, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఖమ్మంలో అన్ని వర్గాల ప్రజలు జోష్ పెంచారు. మంగళవారం ఏడాది చివరి రోజు కావడంతో బేకరీ షాపుల్లో స్వీట్లు, కేకులు కొనేందుకు క్యూ కట్టారు. బిర్యానీ పాయింట్ల వద్ద రద్దీగా మారింది.

మహిళలు ఇంటి ముంగిట ముగ్గులు వేసి రంగులు నింపారు. పలుచోట్ల యువతీయువకులు డ్యాన్స్ చేస్తూ కేరింతలతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.

- ఫొటోగ్రాఫర్ ఖమ్మం, వెలుగు