న్యూ ఇయర్ వేళ.. దేశ వ్యాప్తంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

న్యూ ఇయర్  సందర్భంగా  దేశ వ్యాప్తంగా ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసిన భక్తులు దేవాలయాలకు క్యూ కట్టారు. ఉదయం నుంచే లైన్లలో నిలుచున్నారు. 

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పబ్లిక్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు.  క్యూలైన్లు ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు  అధికారులు, సిబ్బంది. ఇవాళ లక్ష మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంది.

Also Read :- కొత్త ఏడాది కానుకగా.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు

తిరుమలలో న్యూఇయర్ వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఆలయ పరిసరాలలో   నూతన సంవత్సర వేడుకలను ఘనంగా చేసుకున్నారు. గోవింద నామస్మరణ చేస్తూ కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో స్వామి వారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు శ్రీవారి భక్తులు.

 అసోంలోని ప్రఖ్యాత కామాఖ్య ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈశాన్య రాష్ట్రాలతోపాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి పెద్దఎత్తున తరలివచ్చారు.కొత్త  ఏడాది తొలిరోజు కావటంతో...  వేకువజాము నుంచే శక్తి స్వరూపిణీకి ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనానికి  ప్రతియేట కామాఖ్య ఆలయానికి వస్తున్నట్లు భక్తులు చెబుతున్నారు.  

యూపీ మధరలోని బాంకేబిహారీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. దర్శనానికి వేకువజాము నుంచే తరలివచ్చిన భక్తులతో..ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. బారీకేడ్లను దాటుకుని వస్తున్న భక్తులను అదుపుచేసేందుకు ఆలయాధికారులు అవస్థలు పడ్డారు. పవిత్ర బృందావనంలోని రాధావల్లబ్, గోవింద్ దేవ్ జీ ఆలయాల్లోనూ భక్తుల రద్దీ కనిపిస్తోంది.    

జమ్ముకశ్మీర్ లోని ప్రఖ్యాత వైష్ణోదేవీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి పెద్దఎత్తున తరలివస్తున్నారు. భారీగా క్యూలైన్లతో దర్శనం కోసం బారులు తీరారు. కాట్రా నుంచి సుమారు 15 కిలోమీటర్ల మేర జర్నీతో.. భక్తులు కొండపైకి చేరుకుంటున్నారు. జై మాతాదీ నినాదాలతో వైష్ణోదేవీ పరిసరాలు మారుమోగుతున్నాయి