ప్రయాణికులకు శుభవార్త: ఛత్తీస్ ఘడ్, విశాఖ మధ్య వందే భారత్ రైలు

రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది భారత రైల్వే, ఛత్తీస్ఘడ్ విశాఖ మధ్య వందే భారత్ రైలును ప్రారంభించనున్నట్లు తెలిపింది.2024 ఎన్నికల తర్వాత ఈ సర్వీసు అందుబాటులోకి రానుంది. ఛత్తీస్ ఘడ్ లోని దుర్గి నుండి విశాఖపట్టణం వరకు ఈ రైలు నడవనుంది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ వందే భారత్ రైలు దుర్గిలో ఉదయం 6గంటలకు ప్రారంబమై మధ్యాహ్నం 2గంటల 30నిమిషాలకు విశాఖకు చేరుకుంటుంది. తిరిగి ఇదే రైలు విశాఖలో మధ్యాహ్నం 3గంటల 15నిమిషాలకు ప్రారంభమై రాత్రి 11గంటల 50నిమిషాలకు దుర్గి చేరుకుంటుంది.

విశాఖ నుండి విజయనగరం, పార్వతిపురం, రాయగడ, సింగపూర్ రోడ్, కేసింగ, తిట్లాగర్, కంటబన్జీ, ఖారియార్ రోడ్, లఖోలి, రాయపూర్ మీదుగా దుర్గి చేరుకుంటుంది. ఈ రైలు భిలాయ్, చరోదా, కుమ్హరి, రాయపూర్ ప్రాంతాల్లో నివసించే తెలుగువారికి చాలా ఉపయోగపడుతుంది.ప్రస్తుతం విశాఖపట్టణం, దుర్గ్ మధ్య ఉన్న 48స్టేషన్లు, 16గంటల దూరాన్ని ఈ వందే భారత్ రైలు 11స్టేషన్లు, 8గంటలకు కుదించనుంది.