తక్కువ ధర..64MP కెమెరాతో కొత్త ఫోన్.. ధర,ఫీచర్లు,లాంచ్ డేట్ ఇవిగో

స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా(Lava) తన కొత్త ఫోన్ విడుదలకు సంబంధించిన తేదీని అధికారికంగా ప్రకటించింది. Lava Blaze X5G స్మార్ట్ ఫోన్ ను జూలై 10న విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. ఈ హ్యాండ్ సెట్ సొగసైన డిజైన్, ఆసక్తికరమైన ఫీచర్లతో 5G మార్కెట్ లో లో బడ్జెట్ ధరలో అందుబాటులోకి రానుంది. 

Blaze X5G స్మార్ట్ ఫోన్.. కర్వ్ డిస్ ప్లే, డ్యూయెల్ కెమెరా సిస్టమ్ ఫీచ్లర్లతో అమోలెడ్ డిస్ ప్లే, సన్నని బెజెల్స్ తో లేటెస్ట్ డిజైన్ ను కలిగి ఉంటుందని టీచర్ల బట్టి తెలుస్తోంది. మధ్య పంచ్ హోల్ కటౌట్ తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంటుంది. బ్యాక్ ప్యానల్ లో 64MP ప్రైమరీ కెమెరా సెన్సార్, రౌండెడ్ కెమెరా మాడ్యుల్, దీంతోపాటు సెకండరీ కెమెరా, LEC ఫ్లాష్ ఫీచర్లు కూడా ఉన్నాయి. 

ఈ స్మార్ట్ ఫోన్ లో 4GB, 6GB, 8GB తో సహా వివిధ రకాల RAM కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది. అయితే స్టోరేజీ కెపాసిటీ వివరాలు ఇంకా వెల్లడించలేదు.ఈ స్మార్ట్ ఫోన్ రెండు రంగుల్లో లభించనుంది. గ్రే, డార్క్ బ్లూ రెండు వేరియంట్లు బ్యాక్ సైడ్ ప్యానెల్ లో లావా బ్రాండింగ్ ను కలిగి ఉంటాయి. 

కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఈ హ్యాండ్ సెట్ USB టైప్ -సి పోర్ట్, స్పీకర్ గ్రిల్, కింద SIM కార్డు ట్రే ఫీచర్లు ఉంటాయి. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ కుడివైపున అమర్చబడి ఉంటాయి. 

ధర, లభ్యత

ఇండియాలో Lava Blaze X5G స్మార్ట్ ఫోన్ ధర రూ. 20వేలు ఉండొచ్చని అంచనా. ఇది 5G విభాగంలో బడ్జెట్ ఫోన్ గా బలమైన పోటీదారుగా ఉండే అవకాశం ఉంది.  రాబోయే అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2024లో భాగంగా ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందంటున్నారు.