ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు జాజ్ కొత్త మోడల్స్ ‘వీ’ ‘జెడ్‌ఎక్స్’, ‘వీఎక్స్’లను హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్ సీఐఎల్) ఇండియాలో లాంచ్ చేసింది. క్రూజ్ కంట్రోల్, టచ్‌స్క్రీన్ కంట్రోల్ ప్యానల్, ఆటో ఏసీ, టెలిఫోనీ, వాయిస్ కంట్రోల్స్, భారీ కార్గో స్పేస్ ఇందులోని ఆకర్షణలు. రెండు మోడల్స్‌లోనూ బీఎస్-6 1.2 లీటర్ ఐవీటెక్ ఇంజన్ ఉంటుంది. మాన్యువల్ గేర్ ఇంజన్ అయితే లీటరుకు16.6 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. ఆటోమేటిక్ మోడల్ 17.1 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.
