ఎన్జీఓస్ కాలనీ నుంచి లింగంపల్లికి కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ ఆర్టీసీ అధికారులు విడతల సిటీలో గ్రీన్​ ఎలక్ట్రిక్​ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను అందుబాటులోకి తెస్తున్నారు. తాజాగా ఎన్జీఓస్​ కాలనీ నుంచి లింగంపల్లికి కొత్త బస్సులు ప్రారంభించారు. ఈ బస్సులు బీఎన్​రెడ్డి నగర్​ మీదుగా మందమల్లమ్మ, ఆరాంఘర్, నానల్​నగర్​ క్రాస్​ రోడ్, దర్గా, ఖాజాగూడ క్రాస్​రోడ్స్, ఖాజాగూడ, నానక్​రామ్​గూడ, విప్రో సర్కిల్, వేవ్​రాక్, త్రిపుల్​ఐటీ క్రాస్​రోడ్​మీదుగా లింగంపల్లి చేరుకుంటాయని గ్రేటర్​ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్​డైరెక్టర్​వినోద్​కుమార్​తెలిపారు. 

216డబ్ల్యూ/300 నంబర్​తో సోమవారం నుంచి అందుబాటులో ఉంటాయన్నారు. లింగంపల్లి నుంచి ఎన్జీఓ కాలనీకి మొదటి బస్​ఉదయం 5.45 గంటల బయలుదేరుతుందని, ఆఖరి బస్సు రాత్రి 7గంటలకు ఉంటుందని చెప్పారు. ఈ రూట్​లో ప్రతి అరగంటకు ఒక బస్సు తిరుగుతుందని వెల్లడించారు.