ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీ ప్రొడక్ట్‌‌ల కోసం కొత్త ఈ-కామర్స్ పోర్టల్

ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీ ప్రొడక్ట్‌‌ల కోసం కొత్త ఈ-కామర్స్ పోర్టల్
ఈఖాదీఇండియా డాట్ కామ్ లాంచ్ న్యూఢిల్లీ : ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీ ప్రొడక్ట్‌‌ల కోసం ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(కేవీఐసీ) ఈ–కామర్స్ పోర్టల్‌‌ను లాంచ్ చేసింది. ఈఖాదీఇండియా డాట్ కామ్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. అప్పీరల్ నుంచి హోమ్ డెకర్ వరకు 50 వేల ప్రొడక్ట్‌‌లు ఈ కొత్త ప్లాట్‌‌ఫామ్‌‌లో అందుబాటులో ఉండనున్నాయి. రూరల్ ఎకానమీ పెంచడం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన తొలి ఆన్‌‌లైన్‌‌ షాపింగ్ ప్లాట్‌‌ఫామ్ ఈ పోర్టల్ అని కేవీఐసీ ఛైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా తెలిపారు. గత కొన్నేళ్ల నుంచి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ ప్రొడక్ట్‌‌లకు స్థిరంగా డిమాండ్ పెరుగుతోందని పేర్కొన్నారు. 2018–19లోనే ఏకంగా ఖాదీ, విలేజ్ ప్రొడక్ట్‌‌లకు 25 శాతం డిమాండ్ పెరిగినట్టు తెలిపారు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ప్రొడక్ట్‌‌లను వారి ఇళ్ల వద్దకే డెలివరీ చేసేందుకు ఈ పోర్టల్ సహకరిస్తుందని ఏకే శర్మ తెలిపారు. కొత్త తరం కస్టమర్లకు నేచురల్ ఖాదీ ఇండియా ప్రొడక్ట్‌‌లు తేలికగా అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని సక్సేనా చెప్పారు. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్‌‌ అమ్మే ప్రొడక్ట్‌‌లలో అప్పీరల్, గ్రోసరీ, కాస్మోటిక్స్, హోమ్ డెకర్, హెల్త్, వెల్‌‌నెస్ ప్రొడక్ట్‌‌లు, ఎసెన్షియల్స్, గిఫ్ట్స్ ఉన్నాయి. ఖాదీ ట్రేడ్ మార్క్ ప్రొడక్ట్‌‌లు కేవలం ఈ పోర్టల్ ద్వారానే అందుబాటులో ఉంటాయని కేవీఐసీ చెప్పింది.