ట్విట్టర్​, ఇన్​స్టా మూడు గంటలు పని చేయలే

ట్విట్టర్​, ఇన్​స్టా మూడు గంటలు పని చేయలే

న్యూఢిల్లీ: పాపులర్​ సోషల్​ మీడియా ప్లాట్​ఫారమ్స్ ఇన్​స్టాగ్రామ్​, ట్విటర్​ దాదాపు మూడు గంటలపాటు పనిచేయలేదు. దీంతో చాలా మంది యూజర్లు ఇబ్బందిపడ్డారు. టెక్నికల్​ సమస్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు సర్వీసులు గురు, శుక్రవారాల్లో మొరాయించాయి. ట్రాకింగ్​ వెబ్​సైట్​ డౌన్​డిటెక్టర్​ డాట్​ కామ్​ రిపోర్టు ప్రకారం ట్విట్టర్​ మూడు గంటలపాటు పనిచేయకపోవడంతో దాదాపు 50 వేల మంది యూజర్లు గురువారం సాయంత్రం కంప్లైంట్స్​ ఇచ్చారు. సమస్య ఉన్న మాట నిజమేనని, వెంటనే సరిచేస్తున్నామని ట్విట్టర్​ ప్రకటించింది. అంతరాయానికి క్షమాపణలు చెప్పింది. ఇంటర్నల్​ సిస్టమ్స్​లో లోపాల వల్లే ఇలా జరిగిందని, ఇప్పుడు అంతా బాగానే నడుస్తోందని ట్వీట్​ చేసింది.  

ట్విట్టర్ తిరిగి పనిచేయడం మొదలైన తర్వాత, ఫోటో-షేరింగ్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు, దాదాపు 24 వేల మంది ఇన్​స్టా  పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు.  "కొంతమంది ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌ను యాక్సెస్ చేయడంలో సమస్య ఎదుర్కొంటున్నారని మాకు తెలుసు. పరిస్థితిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం" అని మెటా ప్రకటించింది. కొన్ని గంటల తరువాత ఇన్​స్టా సర్వీసులు తిరిగి మొదలయ్యాయి.