కొత్త కార్ల లాంచింగ్‌తో వాహనదారుల్ని మురిపిస్తున్నాయి ఆటోమొబైల్ కంపెనీలు. ఇటు ఢిల్లీలో, అటు షికాగోలో పోటాపోటీగా ఆటో ఎక్స్‌పోలలో కంపెనీలు కొత్త కార్లను ప్రదర్శిస్తున్నాయి. ఢిల్లీలో జరుగుతోన్న ఎక్స్‌పోలో మన దేశంలోనే అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకి ఆల్ న్యూ కాంపాక్ట్ అర్బన్ ఎస్‌యూవీ ఇగ్నిస్‌ను శుక్రవారం లాంచ్ చేసింది. ఈ లాంచింగ్ కార్యక్రమంలో కంపెనీ సీఈవో, ఎండీ కెనిచి ఆయుకవ పాల్గొన్నారు. ఎప్పటి నుంచో వేచిచూ స్తోన్న ఎంజీ గ్లోస్టర్ ఫుల్ సైజ్ ఎస్‌యూవీని కూడా ఢిల్లీ ఎక్స్‌పోలో అధికారికంగా ఇండియాలోకి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఎస్‌యూవీ ఇప్పటికే చైనాలో అమ్మకానికి ఉంది. ఇండియాలో 2020 చివరిలో లేదా 2021 ప్రారంభంలో ఈ ఎస్‌యూవీని లాంచ్ చేయనున్నామని ఎంజీ మోటార్ చెప్పింది. నెక్సాన్, హెక్సా, హారియర్ తర్వాత టాటా మోటార్స్ కూడా ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో గ్రావిటస్‌ను ఆఫర్ చేస్తోంది. ఇది 7 సీటర్‌తో మార్కెట్‌లోకి వస్తోంది. షికాగో ఎక్స్‌పోలో హ్యుండయ్ తన సొనాటా హైబ్రిడ్ వెహికిల్‌ను ప్రదర్శనకు ఉంచింది. ఫోర్డ్ జీటీ కూడా లిక్విడ్ కార్బన్, గల్ఫ్ రేసింగ్ హెరిటేజ్‌తో వాహనదారులను ఆకర్షిస్తోంది.

