రోడ్డు పక్కనే చెత్త పారేసినట్లుగా పసిబిడ్డను పారేశారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో దారుణం జరిగింది.. కొంతమంది దుర్మాఅప్పుడే పుట్టిన మగ శిశువును చెత్తలో పడవేశారు.. శిశువు అరుపులు విని  గమనించిన స్థానికులు...  సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు.

 అమ్మ కడుపులోంచి బైటపడి ఇంకా లోకం వంక కన్నెత్తైనా చూడనేలేదు. అమ్మ పేగు తెంచుకుని పుట్టినప్పుడు అయిన రక్తపు చారికలు ఇంకా ఆరనేలేదు. కాని ఆ తల్లిదండ్రులు ఏం తప్పు చేశారో కాని పండండి మగ బిడ్డను చెత్తకుప్పలో విసిరేసిన ఘటన సిద్దిపేటలో జరిగింది.  . కన్నతల్లి పుట్టిన బిడ్డ భారమనుకుందో ఏమో తెలీదు..నవ మాసాలు మోసి కన్నతల్లి పేగు బంధం బరువనుకుందోమో..అప్పుడే పుట్టిన పసిగుడ్డుకు చెత్తకుప్పలో పారేశారు. . అప్పుడే పుట్టిన పసిబిడ్డను  ఏదో చెత్తను పారేసినట్లుగా రోడ్డు పక్కనే పారేసిన పాశవిక ఘటన సిద్దిపేటలో చోటుచేసుకుంది..

ALSO READ | కూలీలతో వెళ్తున్న ఆటో ట్రాలీ బోల్తా ..ఆరుగురు మహిళలకు తీవ్రగాయాలు

పశువులు..క్రూర జంతువులు కూడా తమకు పుట్టిన బిడ్డనుతమ ప్రాణాలు అడ్డం వేసి కాపాడుకుంటాయి. కానీ అప్పుడే పుట్టిన పసిగుడ్డును రోడ్డు పక్కన దుర్మార్గులు  పారేశారు. పసిగుడ్డు ఏడుపు విని అటుగా వెళ్లే  స్థానికులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.